డ్రైనేజి నిర్మాణ పనులు పరిశీలిస్తున్న మేయర్
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్ :అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర మేయర్ ఎస్ అముద చెప్పారు. 39వ డివిజన్ పరిధిలో ముత్తు మారియమ్మ ఆలయం వద్ద జరుగుతున్న మురుగునీటి కాలువ పైకప్పు పనులను మంగళవారం సాయంత్రం మేయర్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీవద్దని చెప్పారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న పనులు, పురోగతి పైన చర్చించారు.










