మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు
పంటసాగుబడికి నీటిసరఫరా చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు:జాఫర్ సా కాలువ, సర్వేపల్లి కాలవ ద్వారా పంటసాగుబడి చేసుకొనే రైతంగానికి నీటి సరఫరా చేయాలని సిపిఐ జిల్లా రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కన్వీనర్ షాన్‌వాజ్ మాట్లాడుతూ వర్షపు నీరు ద్వారా రైతాంగానికి నీరు అందే సమయంలో జాఫర్ సా, కాలువ సర్వేపల్లి కాలువలకు ప్రభుత్వం సైడ్ వాల్స్ నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. వాస్తవానికి మార్చి నెలలో మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన పనిని ఆలస్యంగా ప్రారంభించడం వల్ల రైతాంగం నష్టపోయిందన్నారు. అక్టోబర్, నవంబర్లో డివైడ్లు కట్టుకుంటూ మట్టి అడ్డం వేసేస్తూ రైతులు నవంబర్ నెల నుంచి వరి సాగు చేసుకోవాల్సి ఉండగా కాలువకి మట్టిని అడ్డంగా వేసి విధంగా అధికారులు, ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఇందుకూరుపేట, తోటపల్లి గూడూర, ముత్తుకూరు, వెంకటాచలంఈ నాలుగు మండలాలు రైతులు పంటలు సాగుబడి చేసుకొనే అవకాశం లేక ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. తక్షణమే జిల్లా ఉన్నత అధికారులు జోక్యం చేసుకోవాలని, వ్యవసాయ శాఖ మంత్రి సైతం ఈ సమస్యపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా, ఆది, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.










