పంట పొలాలపై గజదాడులు
ఆందోళనలో రైతన్నలు
ప్రజాశక్తి- సోమల: సోమల మండలం ఆవులపల్లె, 81 చిన్నఉప్పరపల్లి పంచాయతీలలోని పలు అటవీ సమీప పంట పొలాలపై ఏనుగుల దాడులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం అర్ధరాత్రి చెరకు, మామిడి, సపోటా, అరటి పంటలపై దాడులు చేసి మామిడి కొమ్మలను విరిచి, చెరకు తోటలను ధ్వంసం చేశాయి. అలాగే కొబ్బరి చెట్లను కూడా ఏనుగుల గుంపు విరిచివేశాయి. రెండు పంచాయతీలలో ఆరుగురు రైతులకు చెందిన పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి లక్షల రూపాయల నష్టాన్ని కలిగించినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు రెవెన్యూ వారికి ఫిర్యాదు చేశారు. ఏనుగుల దాడి నుండి తమను తమ పంట పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.










