పంట పొలాలపై ఏనుగుల దాడులు
ఆందోళనలో రైతన్నలు
ప్రజాశక్తి- సోమల
మండలంలోని అన్నెమ్మగారిపల్లె పంచాయతీ ఎర్రగుంతలపల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డిలకు చెందిన టమోటా, చెరకు పంటలపై నాలుగు ఏనుగుల గుంపుగా దాడిచేసి పూర్తిగా నష్టం చేశాయని రైతులు వాపోతున్నారు. అటవీ సమీప సరిహద్దులలో తమ వ్యవసాయ భూములున్న కారణంగా ఏనుగులు తరచూ పంట పొలాలపై వచ్చి పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వారు వాపోయారు. గతవారం రెండు ఏనుగులు పంట పొలాల పై దాడులు చేశాయని, బుధవారం రాత్రి మళ్లీ నాలుగు ఏనుగులు పంటలపై దాడి చేసి ధ్వంసం చేశాయని ఏనుగుల దాడి నుంచి పంట పొలాలను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.










