ప్రజాశక్తి-అనంతపురం రెండు నెలలుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర కేంద్రానికి పంపాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్ సూచించారు. ఈమేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం అమలులో జిల్లా పురోగతిపై ఆరాతీశారు. ఈనెల 12వ తేదీ లోపు కస్టమ్ హైరింగ్ సెంటర్లు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. అలాగే పిఎం కిసాన్ ఇకెవైసి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు మరియు విత్తనాలు పంపిణీ ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.చంద్రానాయక్, డివిజన్ ఎడిఎలు వెంకటరాముడు, యల్లప్ప, పద్మజ, లక్ష్మానాయక్, నారాయణ నాయక్, సాంకేతిక వ్యవసాయ అధికారులు రాకేష్‌నాయక్, శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటకుమార్, వెంకటేశ్వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.చంద్రానాయక్










