పంట నష్టాల అంచనాలు సిద్ధం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి:
మాండూస్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో జరిగిన పంట నష్ట వివరాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రాథమిక అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో భాగంగా జిల్లాలో 144 ఎకరాల్లో వ్యవసాయ 735 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు అంచనాకు వచ్చారు. ఈ మేరకు రెండు శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం మాండూస్ తుపాను కొంతమేరకు జిల్లాలో ప్రభావాన్ని చూపించిన విషయం విధితమే. జిల్లా వ్యాప్తంగా మాస్టర్ నుంచి భారీ వర్షపాతం నమోదయింది దీనివల్ల జిల్లావ్యాప్తంగా ఇటు వ్యవసాయ అటు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా ఏఏ పంటలు నష్టపోయాయి ఎంత విస్తీర్ణంలో రైతులు పోగొట్టుకున్నారు. అనే వివరాలను ప్రాథమిక అంచనా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో భాగంగా వ్యవసాయ పంటలు 1404 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇంటదులో వరి 524.75 ఎకరాల్లో, చెరకు 49 ఎకరాల్లో, ఆముదం రెండు ఎకరాల్లో, వేరుశనగ 561.50 ఎకరాల్లో, ఉద్దులు 96 ఎకరాల్లో, పెసలు ఐదు ఎకరాల్లో, మొక్కజొన 166.50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇలా నివేదిక పంపారు.
735 ఎకరాల్లో ఉద్యాన పంటలు
అలాగే జిల్లాలో 735 ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బ తిన్నాయి. ఇందులో 704 మంది రైతులు నష్టపోయారు. రూ. 4.67 లక్షల నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల్లో వంకాయలు, కాలీఫ్లవర్ టమోటా బంగాళదుంప, పూలు మిరప, అరటి, తమలపాకు, క్యాబేజీ, పుచ్చ వంటివి ఉన్నాయి.










