Oct 27,2023 21:14

ఫొటో : మాట్లాడుతున్న మండల వ్యవసాయ అధికారి శ్రీధర్‌ రెడ్డి

పంట నమోదు తప్పనిసరి
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని 16 రైతు భరోసా కేంద్రాలలో ఖరీఫ్‌ 2023 సీజన్లో పంట నమోదు కార్యక్రమం నిర్వహించామని మండల వ్యవసాయ అధికారి శ్రీధర్‌ రెడ్డి తెలియజేశారు. ఈ పంట నమోదులో ఉన్న రైతుల వివరాలు ఆయా ఆర్‌బికెల్లో 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
పంట నమోదులో పేర్లు, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని సరిగా లేనిచో ఆయా ఆర్‌బికెల్లో సంప్రదించి నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు. పంట నమోదై ఈ కెవైసి చేయించుకుని ఉంటేనే సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్పుట్‌ సబ్సిడీ, పంటలబీమా వర్తిస్తాయన్నారు. పంట వేసిన రైతు సోదరులందరూ ప్రతి సీజన్లో ఈ క్రాప్‌ ద్వారా కచ్చితంగా పంట నమోదు చేయించుకోవాలని కోరారు.