Mar 14,2022 22:17

అభివృద్ది కార్యక్రమాలపై చర్చిస్తున్న ఎంపీపీ


నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయండి
సచివాలయ బాటలో ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
సోమవారం తిరుమలనగర్‌, మంగళం, రణధీర్‌పురం, సప్తగిరినగర్‌ పంచాయతీల్లో సచివాలయ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను అర్హత కలిగిన ప్రతిఒక్కరికి తప్పక అందించాలన్నారు. కులం, మతం, వర్గం, పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు చేరుకోవాలన్నారు. నియోజికవర్గ శాసనసభ్యులు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తుడా నిధులతో ప్రతి పంచాయతీ అభివద్ధికి సంకల్పించారని, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌, ఎంపీటీసీలు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజలకు శుద్ది నీటిని అందించేందుకు పంచాయతీల్లో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమీక్షలో ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఎంపిడిఓ వెంకటనారాయణ, ఈఓపిఆర్డి నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఇ సేతుమాధవ్‌, పిఆర్‌ ఏఇ రాజమస్తానయ్యా, పంచాయతీ కార్యదర్శి కరణం సురెంద్రరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.