Sep 24,2023 20:59

శిక్షణ పొందిన పంచాయతీ కార్యదర్శి ముత్యాలరెడ్డికి సర్టిఫికెట్‌ అందజేస్తున్న డిపిఒ ప్రభాకర్‌రావు

          ప్రజాశక్తి-అనంతపురం సిటీ   గ్రామ పంచాయతీల ఆర్థికాభివృద్ధికి కార్యదర్శులు కీలకంగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్‌.ప్రభాకర్‌రావు సూచించారు. ఆదివారం స్థానిక టిటిడిసి శిక్షణా సంస్థలో జిల్లాకు చెందిన 1వ గ్రేడ్‌ నుంచి 5వ గ్రేడ్‌ వరకూ ఉన్న పంచాయతీ కార్యదర్శులకు 4వ విడత శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు రోజుల శిక్షణ తీసుకున్న పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ పరిపాలన, పంచాయతీ పరిధిలోని లే అవుట్లు, బిల్డింగులు, డూమ్‌, సీసీఎ రూల్స్‌, రిజిస్టర్ల నిర్వహణ, ఉపాధి హామీలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణలో పొందిన అనుభవాలను పంచాయితీ అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. అనంతరం శిక్షణ తీసుకున్న పంచాయతీ కార్యదర్శులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఒ జి.లక్ష్మీనరసింహా, నిర్మల్‌దాస్‌, డిటిఎం పి.సదాశివ, జి.రామాంజనేయులు, నరసింహారెడ్డి, ఎస్‌.పి.రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.