పంచాయతీ ఉప ఎన్నిక ప్రశాంతం
ద గుడిపల్లిలో టిడిపి ఘన విజయం ద వైసిపి మద్దతుదార్లదే హవా
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్, యంత్రాంగం
చిత్తూరు జిల్లాలో భారీ బందోబస్తు నడుమ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఎన్నికలు జరగాల్సిన మూడు గ్రామపంచాయతీ లు విజయపురం మండలం మల్లికాపురం, కార్వే టినగరం మండలం కత్రిపల్లి, జీడీనెల్లూరు మం డలం జీడీనెల్లూరు పంచాయతీ సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక వార్డుల విషయానికి వస్తే గుడిపాల మండలం పానాటూరు, పెద్దపంజాణి మండలం పెండకురికుంట వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 37 వార్డుల్లో నామినేషన్ల స్క్రూట్నీ తరువాత ఒక్కో అభ్యర్థి మాత్రమే మిగలడంతో ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారు. శాంతిపురం మండలం కడపలి 10వ వార్డు, మత్యం 10వ వార్డు, యాదమరి మండలం కాశిరాళ్ల రెండో వార్డు, వి.కోట మండలం కొంగాటం ఒకటో వార్డు, జీడీనెల్లూరు మండలం వరత్తూరు రెండో వార్డు, ఐరాల మం డలం కాణిపాకం ఐదో వార్డు, గుడిపల్లి మండలం పెద్దబ్బనవాడ నాలుగో వార్డుకు శనివారం ఎన్ని కలు జరిగాయి. ఎన్నికలు జరిగే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఎంపిడిఒ, తహశీల్దార్, ఎస్‌ఐలను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ ఆదేశౄల మేరకు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్‌పి స్వయంగా యాద మరి మండలంలోని కాశిరాళ్ల గ్రామపంచాయతీ ఎన్నికల సరళిని పరిశీలించారు. జడ్‌పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డి కాణిపాకం పంచాయతీలో పర్యవేక్షించారు. ఉద యం నుండీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారు లు తీరారు. పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్లను లెక్కించి ఎన్నికల అధికారులు విజేతలను ప్రకటించారు.
వార్డు విజేతలు వీరే...
శాంతిపురం మండలం కడపల్లి పం చాయితీ 10వార్డులో బి. సుధాకర్, మత్యం 10 వార్డు రమణప్ప. యాదమరి మండలం కాశిరాళ్ళ 2వార్డు ఎ. రజని, వికోట మండలం కొంగొత్తం 1వార్డు వరలక్ష్మి, జీడి నెల్లూరు వరత్తూరు 2 వార్డు నాగరాజు, ఐరాల మండలం కాణిపాకం 5 వార్డు మౌనిక, గుడిపల్లి మండలం 4వార్డు మంజునాథ్ లు వార్డు సభ్యులుగా విజయం సాధించారు.
గుడిపల్లిలో టిడిపి ఘన విజయం
గుడిపల్లి... మండలంలోని బేబీవాడ గ్రామ పంచాయతీకి చెందిన నాలుగో వార్డులో టిడిపి ఘన విజయం సాధించిందని ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. టిడిపి అభ్యర్థి జి.మంజునాథ్ 66 ఓట్లు సమీప వైసిపి అభ్యర్థిపై సాధించారు.
కొంగాటంలో 122 ఓట్ల ఆధిక్యం
వి.కోటలో ... కొంగాటం పంచాయతీ ఒకటో వార్డుకు వైసిపి అభ్యర్థి వరలక్ష్మి విజయం సాధించారు. మొత్తం 545 ఓట్లకు గాను 472 ఓట్లు పోలయ్యాయి. వైసిపి అభ్యర్థి వరలక్ష్మికి 296 ఓట్లు వచ్చాయి. సుజాతమ్మకు 174 రాగా, రెండు నోటాకు పోలయ్యాయి. వైసిపి నేత కోట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి బలపరచిన వరలక్ష్మి 122 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
12 ఓట్ల తేడాతో గెలుపు
యాదమరిలో... కాశిరాళ్ల పంచాయతీ రెండో వార్డులో వైసిపి అభ్యర్థి రజనీ విజయం సాధించారు. వైసిపికి 62 ఓట్లు, టిడిపికి 50 ఓట్లు వచ్చాయి. కేవలం 12 ఓట్ల ఆధిక్యంతో రజని విజయం సాధించారు.
కందూరులో మనోజ్‌కుమార్ ఏకగ్రీవం
సోమలలో ... మేజర్ పంచాయతీ కేంద్రమైన కందూరులో నాలుగో వార్డు మెంబర్ మనోజ్‌కుమార్ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవమైన ట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
బైరెడ్డిపల్లిలో... బెలుపల్లి పంచాయతీ ఏడో వార్డులో వైసిపి అభ్యర్థి కె.భరత్‌కుమార్, గౌనితిమ్మేపల్లిలోని రెండో వార్డులో సి.రెడ్డెప్ప ఏకగ్రీవమైనట్లు ఎంపిడిఒ రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు.
గంగాధరనెల్లూరులో... వరత్తూరు పంచాయతీ కాలేపల్లి రెండో వార్డులో వైసిపి అభ్యర్థి నాగరాజు, టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణపై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.










