ప్రజాశక్తి - వి కోట (చిత్తూరు జిల్లా) : మేజర్ గ్రామ పంచాయితీ అయిన వి కోట పరిదిలోని పంచాయతీ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని సర్పంచ్ పి.ఎన్.లక్ష్మి తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా అవసరాల నిమిత్తం పంచాయతీ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనంతరం వైసిపి రాష్ట్ర కార్యదర్శి పీ.ఎన్. నాగరాజు మాట్లాడుతూ పంచాయతీ ఆస్తుల అన్యాక్రాంతాన్ని అడ్డుకుంటే పంచాయతీ ఈవో సిబ్బందిపై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ప్రజలు పంచాయతీ ఆస్తులు పరిరక్షించాలన్న ఉద్దేశంతో అధికారాన్ని కట్టబెట్టారని తమ హయాంలో కేజిఎఫ్ బస్టాండ్లోని పంచాయతీ స్థలంలో ఆధునీకరించే పనులలో భాగంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించామన్నారు. సదరు స్థలానికి పక్కనే ఉన్న పంచాయతీ స్థలాల్లో కొంతమంది అక్రమంగా ఉన్నట్లు గుర్తించి వారిని ఖాళీ చేయాల్సిందిగా గతంలోనే ఆదేశించామన్నారు. పాత నిర్మాణాలను తొలగించి కొత్తగా నిర్మాణాలు చేపట్టిన వారికి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించినా దౌర్జన్యంగా పనులు చేపట్టఢంతో పంచాయతీ ఈవో.. కార్మికులు పనులను అడ్డుకుని వాటిని పాక్షికంగా తొలగించారన్నారు. ఇంతలో ఆక్రమణ దారులు పంచాయతీ ఈవో సిబ్బందిపై భౌతిక దాడులకు దిగడం విచారకరమన్నారు. సదరు స్థలం పంచాయితీ స్థలంగా రికార్డులలో ఉందని ఏదైనా రికార్డులు ఆక్రమణ దారులవద్ధ ఉంటే వాటని అధికారుల వద్ద చూపించి భవన నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలన్నారు. పంచాయితీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామే తప్ప ఎక్కడా తమ స్వప్రయోజనాలకు లేదని . దీన్ని ప్రజలు గుర్తించి పంచాయితీ ఆస్తులను పరిరక్షణకు తమతో కలసి నడవాలన్నారు.ఈకార్యక్రమంలొ ఉపసర్పంచి అక్మల్ పాల్గొన్నారు.










