ప్రజాశక్తి-వడమాలపేట(తిరుపతి) : సత్యవేడు డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు ఉదయం 8:30గం సమయంలో వడమాలపేట సమీపం రెండో మలుపు బ్రిడ్జ్ కాలువలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికి ఎలాంటి అవాంఛనీయం జరగలేదని సమాచారం. చిన్న చిన్న గాయలతో బయట పడ్డవారిని పుత్తూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించ్చినట్లు స్థానికులు చెప్పారు. బస్సులో ఒక నిండు గర్భిణి ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్చి ఉంది.










