పట్టుకున్న అధికారులు
ప్రజాశక్తి - పెనుగొండ
సిద్ధాంతం గ్రామంలో గురువారం రాత్రి కోతి స్వైర విహారం చేసి పలువురిని గాయపర్చింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శుక్రవారం అధికారులు కోతిని పట్టించారు. గ్రామానికి చెందిన మండవల్లి రమణయ్యపై వానరం దాడి చేసి గాయపర్చింది. తణుకు తీసుకెళ్లి వైద్యం చేయించామని బంధువులు తెలిపారు. అలాగే ఆ ప్రాంతంలోనే నివాసముంటున్న చింతపల్లి రవీంద్రను గురువారం అర్ధరాత్రి వానరం దాడి చేసింది. దీంతో స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా సర్పంచి చింతపల్లి గనిరాజు (చంటి), కార్యదర్శి ఎస్‌వివి.నరసింహమూర్తి కోతిని పట్టించారు. దీంతో సిద్ధాంతం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి వానరాన్ని పట్టుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.










