Oct 25,2023 20:15

మందులు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - లింగసముద్రం : పెంట్రాల ,సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఐదుగురు వైద్యుల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశారు.ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపిడిఓ శేషుబాబు మాట్లాడుతూ ప్రజలకు మేరుగైన వైద్యం అందించాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకరావడం జరిగిందన్నారు.ఈ అవకాశాని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.డాక్టర్‌అనూరాధ ఆధ్వర్యంలో డాక్టర్‌ వర్షిత,డాక్టర్‌ మౌనిక,డాక్టర్‌ పేరయ్య,డాక్టర్‌ సమీర్‌లతో కూడిన బృందం ప్రజలకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ టి.ప్రసాద్‌,సిహెచ్‌ఓ శ్రీనివాసులు,పెంట్రాల సర్పంచ్‌ బాబురావు,వైసిపి మండల కన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,జెసిఎస్‌ కన్వీనర్‌ వరికూటి క్రిష్ణారెడ్డి,ఎఎంసి వైస్‌ చైర్మన్‌ మేకనబోయిన శ్రీనివాసులు,సర్పంచ్‌లు దామా సీతారామయ్య,డబుగొట్టు మల్లిఖార్జున,వంటేల శ్రీనువాసులు,వైసిపి నాయకులు మాచేపల్లి మాల్యాద్రి,అల్లం రాజేష్‌,వంకాయపాటి వెంకటేశ్వర్లు,పంచాయితీ కార్యదర్శి మాధవరావు ఉన్నారు.