
ప్రజాశక్తి- సరుబుజ్జిలి: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తూ... ప్రజలను, ప్రతిపక్షాలను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని వెన్నెలవలస, చిగురువలస గ్రామాల్లో ఆదివారం బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వెన్నెలవలసలో గిరిజనులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి పాలనలోనే గిరిజనులకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. అనంతరం ఇంటింటికీ పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు శివ్వాల సూర్యనారాయణ, అంబళ్ల రాంబాబు, లావేటి పూర్ణ, కె.సూర్యనారాయణ, టి.వి.రమణ, ఎస్.గోవిందరావు, గుర్రాల చినబాబు, కొమనాపల్లి రవికుమార్, బాన్న వెంకటరమణ, బి.ఉమ, ఎస్.రాజారావు పాల్గొన్నారు.
పొందూరు: మండలంలోని తుంగపేటలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిఎన్‌టియు జిల్లా అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జి గాడు నారాయణరావు, సర్పంచ్ పప్పల వేణుగోపాలం ఆధ్వర్యాన బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, అరాచక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా పోస్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూన తేజేశ్వరరావు, కూన బాలకృష్ణ, పారంనాయుడు, కృష్ణవేణి, అప్పలనాయుడు పాల్గొన్నారు.