నృత్యం చేస్తున్న విద్యార్థినులు
పలు రకాల రాకెట్ నమూనాలు ఏర్పాటు
ప్రజాశక్తి-సంగం:స్థానిక జెడ్‌పి హైస్కూల్లో 15 మంది శాస్త్రవేత్తల బందం భారత అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా బస్సు ఎబ్జిబిషన్ ,పలు రకాల రాకెట్ నమూనాలు ఏర్పాటు చేసి అంతరిక్ష ప్రయోగాల ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బస్సు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినఉన్న చంద్రయాన్ -3 నమూనాలు, పలు అంతరిక్ష ప్రయోగాల నమూనాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.శాస్త్రవేత్తలు వీడియో ప్రదర్శన ద్వారా అంతరిక్ష ప్రయోగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.మండలంలో చుట్టుపక్కల గ్రామాల పాఠశాల విద్యార్థులు భారీగా వచ్చి ఈ నమూనాలను, బస్సు ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీహరికోట శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి మానవుడు అంతరిక్ష ప్రయోగాల ఫలితాలను తెలుసుకోవడమే భారత అంతరిక్ష వారోత్సవాల ముఖ్యోద్దేశమని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారులు శ్రీనివాసులు,హెడ్మాస్టర్ బుజ్జయ్య, జిల్లా సైన్స్ కేంద్రం క్యూరేటర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










