Feb 22,2022 16:08

ప్రజాశక్తి-కలకడ: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలకడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మన్మధ కుమార్ తెలిపారు. మండల కేంద్రమైన కలకడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పుట్టిన బిడ్డ మొదలు ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈనెల 28వ తేదీన మరియు వచ్చే నెల ఒకటవ తేదీన డోర్ టు డోర్ తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మల్లికార్జున, సిహెచ్ఓ నారాయణ, ఎంపిహెచ్ ఈవో వెంకటేశు, ఎంపీ హెచ్ఎస్ వెంకటేశ్వరరావు, రామకృష్ణమ్మ, పిహెచ్ సి పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.