ప్రజాశక్తి-పిచ్చాటూరు (చిత్తూరు) : నిండు ప్రాణానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారి డాక్టర్ గాయత్రి అన్నారు. శనివారం పల్స్ పోలియో పై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ... ఈ నెల 27న ఆదివారం మండలంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి మొత్తం 35 బూత్ లు, ఒక మొబైల్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. మండలంలో 5 ఏళ్ల లోపు చిన్నారులు మొత్తం 3750 మంది ఉన్నారన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులకు సోమ, మంగళ వారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని ఆమె కోరారు.










