Sep 04,2022 22:21

పలమనేరు బాలాజీకి ఘన సన్మానం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

చిత్తూరు జిల్లా కేంద్రంలో రెవెన్యూ భవనంలో చిత్తూరు జిల్లా రచయితల సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో పలమనేరు రచయితల సంఘం అధ్యక్షులు, పలమనేరు బాలాజీని చిత్తూరు జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈకార్యక్రమంలో చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ రామలక్ష్మి, హరికష్ణారెడ్డి, గౌరవాధ్యక్షులు కట్టమంచి బాలకష్ణారెడ్డి, అమ్మా యాక్ట్స్‌ చైర్మన్‌ దశరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు దశాబ్దాలుగా రచనా రంగంలో సాహిత్య సేవతో పాటు రాయలసీమ సాహితీ సంస్థ నిర్వాహకులుగా, పలమనేరు రచయితల సంఘం అధ్యక్షులుగా, పలు సాహిత్య కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహించడం పట్ల చిత్తూరు జిల్లా రచయితల సంఘం వారు అభినందించి సత్కరించారు.