ప్లాస్టిక్‌తో ప్రమాదం
చిన్నారులపై ప్రభావం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
నేడు ప్రతివస్తువూ తక్కువ ధరకు ప్లాస్టిక్ రూపంలో లభ్యమవుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించినా ఏదో రూపంలో వాడాల్సిన పరిస్థితి హనికరం అంటూ ప్లాస్టిక్ కవర్లును నిషేదించినా ఇతర వస్తువుల నుంచి ముప్పులేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. పర్యావరణం పేరుతో ప్లాస్టిక్ నిషేదాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలున్నా ప్లాస్టిక్ వస్తువులు చెరువులు, కాలువల్లో పేరుకుపోతున్నాయి. ఎటు చూసినా ప్లాస్టిక్ వస్తువులతో నగరంలోని ప్రధాన వీధులు నిండిపోతున్నాయి. వాటర్ ప్లాకెట్లు మొదలు కొని కాళ్లకు తొడుకొనే చొప్పుల వరకు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే... అన్నీటా ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ నిండిపోయింది.
బడికి వెళ్లే చిన్నారుల బ్యాగుల్లోని వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్‌లు, బూట్లు, పుస్తకాల సంచి ప్లాస్టిక్‌మయం. నాణ్యత లోపించినా అధికంగా వినియోగించినా భవిషత్తులో చిన్నారకులు పెనుప్రమాదం తప్పదని వైద్యులు, ప్రకృతి ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్తు ప్లాస్టిక్ వినియోగంతో దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు పాఠశాల సమయంలో బూట్లు, బ్యాగులు వాడుతున్నారు. నిత్యం బూట్లు వాడటం, నాణ్యత లేని బ్యాగుల వినియోగం వల్ల చిన్నారుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వాడుతున్న తాగునీటి సీసాలు, బ్యాగుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసరం ఎంతైనా ఉంది.
తగిన జాగ్రత్తలు పాటిస్తే... మేలు
తల్లిదండ్రులు తక్కువ బరువుగల రెగ్జిన్ పుస్తకాల బ్యాగులను పిల్లలుకు అందించాలి. బరువు ఎక్కువగా ఉన్న నైలాన్, ప్టాస్టిక్ బ్యాగులతో వారి ఆరోగ్యంతో పాటు పర్యావరానికి నష్టమనే విషయం గమనించాలి. బరువు ఎక్కువగా ఉంటే చిన్నారుల వెన్నెముకపై భారం పడటంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నైలాన్, ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉండే రసాయనాలతో శరీరంలోకి అధిక ఉష్ణోగ్రత చేరడంతోపాటు ఆరోగ్యంపై నిదానంగా దుష్ప్రభావం చూపుతాయి. ఆలాగే ముదురరంగు బ్యాగులు త్వరగా వేడిని గ్రహిస్తాయి. శరీరం త్వరగా వేడెక్కి ప్రమాదముంది. వాటర్ ప్రూప్ సంచులైతే పుస్తకాలకు ఎంతో మంచిది.
నాసిరకంతో తంటాలు తప్పవు..
ప్లాస్టిక్ లంచ్ బాక్సులు వినియోగించొద్దు. అవి పలురకాల రసాయనాలు విడుదల చేస్తాయి. వేడి ఆహారం లంచ్‌బాక్సులో వేడివేడిగా వేసినప్పుడు ఆహారంలో కలసిపోయి చిన్నారులపై ప్రభావం చూపుతాయి. స్టీల్, సత్తు లంచ్‌బాక్సుల వాడకం మంచింది. బరువు తక్కువగా ఉండి తేలికగా తెరిచేలా ఉండాలి. ప్లాస్టిక్ మంచినీళ్ల సీసాలో బ్యాక్టీరియా, వైరస్ తొందరగా వ్యాప్తిచెందుతుంది. ప్లాస్టిక్ విడుదల చేసే రసాయనలతో పాటు ఇవి నీళ్లలో చేరి పిల్లల్లో డయేరియా, ఎముకల ఎదుగుదల తగ్గిపోయివడం, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తగిన జాత్త్రలు పాటించాలి
చిన్నారులు అంటే ప్రాథమిక విద్య అభ్యసించే విద్యార్థుల వాడే నీళ్ల సీసాలు, లంచ్‌బాక్సుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలకు విద్యార్థి దశ నుండీ ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలి. భోజనానికి ముందు భోజనం తరువాత చేతులు శుభ్రంగా కడుకొనే అలవాటు చేయాలి. ప్లాస్టిక్ సీసాలు, లంచ్‌బాక్సులకు ప్రత్యామ్నాంగా స్టీలు, సిల్వర్ బాక్సులు వాడకం మంచింది. ముఖ్యంగా చవకగా దొరికే ప్లాస్టిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ సుదర్శన్, జాతీయ బాలల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్










