ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సరైన సయంలో నీరు, ఆహారం అందించి పక్షులను కాపాడుకుందామని శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎస్‌కుయు ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో వేసవి సమయంలో పక్షులకు నీరు, ఆహారం అందించేందుకు చెట్ల వద్ద కుండలు ఏర్పాటు చేశారు. ఈమేరకు ఆయా కుండలు, ధాన్యపు కంకులను విసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ పక్షుల కోసం విశ్వవిద్యాలయంలో ఉన్న చెట్లకు ఈ విధంగా ఆహారం, నీటి కుండలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మనుషులతో పాటు పక్షులు, జంతువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌యెయు రెక్టార్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డి.మురళీధర్‌రావు, బీ.ఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నీలకంఠాపురం సదాశివరెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సత్యసౌమ్య, బాల సత్యనారాయణ, చాగంటి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పక్షుల నీటి కోసం ఏర్పాటు చేసిన కుండలను చూపుతున్న ఎస్‌కెయు విసి రామకృష్ణారెడ్డి, సిబ్బంది










