మాట్లాడుతున్న ఎంఎల్‌సి పర్వతరెడ్డి
పక్కాగా నాడు..నేడు, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యాశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాలైన నాడు..నేడు పనులు, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఆ శాఖ అధికారులకు ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా డి ఈ ఒ , డి వై ఈ ఒ, ఎంఈఓలతో జెట్‌పి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా విద్యాశాఖ లో జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విద్యాశాఖ అధికారులు వివరించారు. అనంతరం ఎంఈఓ లు తమ సమస్యలను తెలియజేశారు. యం ఈ ఓ లు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కషి చేస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజాపరిషత్తు చైర్మన్ ఆనం అరుణమ్మ,ఎంఎల్‌సి పి.చంద్రశేఖర్‌రెడ్డిలు పేర్కొన్నారు. అనంతరం ఎంఎల్‌సి పి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వేచ్ఛ పథకం ద్వారా విద్యార్దినిలకు అందిస్తున్న శానిటరి నాప్ కీన్స్ ను సంవత్సరానికి ఒకేసారి కాకుండా, ప్రతినెల అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాల్ ల్యాబ్స్ ద్వారా మాథ్స్ టీచర్స్ విధిగా వారానికి ఒక తరగతిని వినియోగించుకొని గణితం మీద నైపుణ్యాలను 7 నుంచి 10 తరగతి వరకు పెంచాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలకు అందజేస్తున్న ఐఎఫ్‌పి బోర్డ్స్ ఒకొక్కటి లక్షా,50వేలకు పైగా ఖర్చు చేస్తుందన్నారు. ఈ బోర్డులను వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని.. ఇంటర్నెట్ కనెక్షన్ లేని చోట మొబైల్ హాట్ స్పాట్, లేదా పెన్ డ్రైవ్ ద్వారా గాని పాఠ్యాంశాల బోధన కొనసాగించాలని సూచించారు. బైజుస్ ట్యాబ్స్ . బైజుస్ టాబ్స్ నిర్వహణను గ్రామ, వార్డ్ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్స్ అప్పగించాలని సూచించారు. జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుక ద్వారా అందిస్తున్న డిక్షనరీ ని.. ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ను అందిస్తున్నందున ప్రతి విద్యార్థి డిక్షనరీ ని తప్పకుండా తీసుకువచ్చే విధంగా చూడాలని సూచించారు. టోఫెల్ , ప్రాథమిక స్థాయిలో టోఫెల్ శిక్షణ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, దానికి సంబందించిన టైం టేబుల్ ను ఇంగ్లీష్ టీచర్స్ కే కాకుండా అందుబాటులో ఉన్న అందరికీ వేయాలన్నారు. కెరీర్ గైడెన్స్ ప్రతి శుక్రవారం 9,10 తరగతుల విద్యార్థులకు జరిగే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ను మరింత సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులను ప్రతిభవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు .










