పక్కాగా లబ్ధిదారుల ఈ-కేవైసీ నమోదు: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
హౌసింగ్ లబ్ధిదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలోని 9,10 వార్డులో పర్యటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జగనన్న హౌసింగ్ కాలనీల్లో ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు, టిడ్కో గహాల లబ్ధిదారులు బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ నమోదు చేయాలన్నారు. కమిషనర్ స్వయంగా పలువురు లబ్ధిదారుల ఈకేవైసీ నమోదు చేసి హౌసింగ్ లబ్ధిదారులతో మాట్లాడారు. పక్కాగహాలను వేగంగా నిర్మించుకోవాలని కోరారు. హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, నీటి సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జయలక్ష్మి, మెప్మా సీఎంఎం గోపి, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










