Sep 02,2023 21:48

ఓటర్ల రీవెరిఫికేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా చేపడుతున్న ఓటర్ల రీవెరిఫికేషన్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సిబ్బందికి ఆదేశించారు. శనివారం నాడు రాప్తాడు మండలంలోని మరూరు, రామనేపల్లి గ్రామాల్లో స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌-2024లో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మరణం, ఇళ్లు మార్పు తదితర ఓటర్లు అన్నింటినీ రీవెరిఫికేషన్‌ చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 6, 2022 తేదీ నుంచి ఆగస్టు 9, 2023వ తేదీ వరకు జిల్లాలో 96,153 డిలీషన్‌ క్లెయిమ్స్‌ వచ్చాయన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా రీవెరిఫికేషన్‌ పూర్తి చేయాలని బిఎల్‌ఒలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, ఈఆర్‌ఒ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్‌ నరసింహులు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.