అనంతపురం : అనంతపురం రుద్రంపేట, పివికెకె ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నాడు జేసీబీ గోల్డ్ ఫీల్డ్ ప్రై||లి|| ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వైభవ్ మాట్లాడుతూ ప్రాంగణ నియామకాలను పీవీకేకే పాలిటెక్నిక్‌లో ప్రస్తుతం డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించినట్లు చెప్పారు. ప్రఖ్యాత సంస్థ జేసీబీ గోల్డ్ ఫీల్డ్ ప్రై||లి|| ద్వారా నిర్వహించామన్నారు. ప్రాంగణ నియామక అధికారి డా||భాను కిరణ్ మాట్లాడుతూ ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్ అనంతరం 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. వీరికి ఆ సంస్థ 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వివిధ విభాగాలలో సర్వీస్ ట్రైనీ, సర్వీస్ ఇంజినీర్లుగా నియమిస్తారని చెప్పారు. శిక్షణా సమయంలో వసతి భోజన సదుపాయాలతో పాటు నెలకు 10 వేల రూపాయలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్లొమా కళాశాల ప్రిన్సిపాల్ వైభవ్, సంస్థ ప్రతినిధులు సారథి, హెచ్‌ఆర్ మేనేజర్ విజయ భాస్కర్, జోనల్ మేనేజర్, మెకానికల్ విభాగాధిపతి జయలక్ష్మి పాల్గొన్నారు.










