సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ
ప్రజాశక్తి - పాలకొల్లు
పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే ముందు తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఉండగా సెల్‌ఫోన్‌కు వాడరాదని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కోరారు. స్థానిక వైష్ణవి హైస్కూల్లో ఆదివారం రాత్రి జరిగిన హైస్కూల్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రులను అన్నీ కావాలని అడుగుతారని, తెల్లవారుజామున లేపమని ఎందుకు అడగరని విద్యార్థులను ప్రశ్నించారు. చదివిన స్కూళ్లకు ముఖ్య అతిథిగా రావడానికి పిల్లలు కృషి చేయాలని కోరారు. అప్పుడే తల్లిదండ్రులు నిజంగా ఆనంద పడతారని చెప్పారు. మాతృభాషలో పట్టుఉంటే ఏ సబ్జెక్టు, ఎన్ని భాషలైనా బాగా వస్తాయని చెప్పారు. చిన్నతనం నుంచి భగవద్గీత శ్లోకాలు చెబుతున్న తెలుగు టీచర్‌ను ఆయన సత్కరించారు. విలువలతో కూడిన విద్య నేర్పుతున్న స్కూల్ కరస్పాండెంట్ బి.శ్రీనివాస్ రమను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీ పూర్తయ్యాక రైలు ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నా ఇతరులకు రోల్ మోడల్‌గా నిలిచి వేదాంతం సదాశివ మూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు.










