May 31,2023 21:11

ప్రజాశక్తి - పోడూరు
తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యలో బడి మాన్పించకుండా ఉన్నత చదువులు పూర్తి చేసే వరకూ చదివించాలని తహశీల్దార్‌ కృష్ణారావు పిలుపునిచ్చారు. గుమ్ములూరు పంచాయతీ పరిధిలోని పైడవ గ్రామంలో బుధవారం సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పౌర హక్కుల గురించి వివరించారు. స్థానిక ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వైద్యం తదితర సదుపాయాల గురించి వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ చట్టంపై, మహిళలకున్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గొట్టుముక్కల సోనియా రమేష్‌, ఎంపిటిసి అంబటి సుధాకర్‌, పోడూరు ఎస్‌ఐ డి.రామకుమార్‌, ఆర్‌ఐ కె.రాంబాబు, సచివాలయ కార్యదర్శి పిల్లి కృష్ణవర్మ పాల్గొన్నారు.