Nov 30,2022 22:05

జగనన్న విద్యాదీవెన చెక్కులు అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌

పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి 'చదువే'
'విద్యాదీవెన'కు రూ.23.40 కోట్లు జమ

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌

రాష్ట్రంలోని ప్రతి బిడ్డా చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్షని, పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువేనని మదనపల్లి సభలో లాంఛనంగా 'విద్యాదీవెన' నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యాదీవెన కింద నాలుగో త్రైమాసికానికి జిల్లాలోని 37,328 మంది తల్లుల ఖాతాలకు రూ.23.40 కోట్లు జమ చేశామన్నారు. కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, నగర మేయర్‌ అముద, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ శైలజా చరణ్‌రెడ్డి, జడ్‌పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డి, బిసి సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబల్‌, మైనార్టీ సంక్షేమ అధికారులు రబ్బానీ బాషా, మూర్తి, చెన్నారెడ్డి పాల్గొన్నారు.