తణుకురూరల్:2022-2023 విద్యా సంవత్సరానికి గాను పీజీ సెట్‌లో ఎస్‌కెఎస్‌డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు 8 మంది 100లోపు స్టేట్ ర్యాంకులు, 25 మంది 500లోపు ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి మాట్లాడుతూ ఇంత మంచి ర్యాంకులు సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. విద్యార్థినులను వైస్ ప్రిన్సిపల్ లెఫ్టనెంట్ యు.లక్ష్మీ సుందరీబారు, కె.పద్మజారాణి అభినందించారు.










