Jul 12,2023 21:23

ప్రజాశక్తి - గణపవరం
         మండలంలో ముప్పర్తిపాడు గ్రామానికి చెందిన పిఎంపి డాక్టర్‌ వీరసత్యనారాయణకు జులై నెల విద్యుత్‌ బిల్లు రూ.18,769 రావడంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. ప్రతినెలా విద్యుత్‌ బిల్లు రూ.500 మించి వచ్చేది కాదని చెప్పారు. తన ఇంటికి ఎసి కూడా లేదని తెలిపారు. రూ.18 వేలకు పైగా విద్యుత్‌ బిలుల రావటంపై ఆయన ఆందోళనకు గురైనట్లు చెప్పారు. బిల్లు సరి చేయాలని అధికారుల వద్దకు వెళ్లగా వారు అందుబాటులో లేరని చెప్పారు. అధికారులు స్పందించాలని కోరుతున్నాడు.