Jun 21,2022 22:08

పిడుగుపాటుకు పాడి ఆవులు మృతి
ప్రజాశక్తి- యాదమరి

మండలంలోని పిడుగుపాటుకు మూడు పాడి ఆవులు మతి చెందాయి. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కష్ణంపల్లి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి వ్యవసాయం చేసుకుని ఆవుల ద్వారా జీవనం సాగిస్తున్నాడు. ఇతను సోమవారం సాయంత్రం ఆవులు మేపి పొలంలోని కొట్టంలో గడ్డివేసి వచ్చినాడు. రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో కొట్టంపై పిడుగు పడటంతో కొట్టంలో మూడు పాడి ఆవులు మతి చెందాయి. ఉదయం పొలం వద్దకు వెళ్లడంతో మతిచెందిన పాడిఆవులను చూసి కుటుంబసభ్యులు రైతు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే యాదమరి పశువైద్యాధికారి అమర్‌నాథ్‌ తెలపడంతో ఆయన వచ్చి రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పంచనామా పోయిన పాడి రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే ఈవిధంగా చర్యలు తీసుకున్నట్లు చేస్తున్నట్లు వైద్యాధికారి అమరనాథ్‌ తెలిపారు. రెవెన్యూ అధికారి వెంకటేష్‌ పిళ్లై సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.