ప్రజాశక్తి : చౌడేపల్లి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పుంగనూరు చౌడేపల్లి మండలంలో పిడుగు పడి వ్యక్తి మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. చౌడేపల్లి నుంచి కంపల్లికి వెళ్తుండగా దారి మద్యలో వర్షం పడటంతో దొడ్డి గాని దేవాలయం వద్ద బాధితులు అగారు. ఈ క్రమంలో సమీపంలోని చెట్టుపై పిడుగు పడటంతో ప్రభాకర్ రెడ్డి( 50 ) అక్కడిక్కడే మృతి చెందాడు. తెల్ల నీళ్ళ పల్లి భాస్కర్ రెడ్డి(45), రామ్మూర్తి రెడ్డి 40, రాజమ్మ 65, సీతారామిరెడ్డి 70, అనూష 6, మోహిత్ రెడ్డి (8)కి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వైద్యం కోసం పుంగనూరు, చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.










