పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుందాం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగకుండా పోరాడే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుందామని రిటైర్డ్ ప్రొఫెసర్, సీఐటీయూ నాయకులు ఎస్‌ఎమ్ షరీఫ్ పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభధ్రుల స్థానాలకు ప్రోగ్రసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఫ్) అభ్యర్థులుగా పి. బాబురెడ్డి(ఉపాధ్యాయ), మీగడ వెంకటేశ్వర రెడ్డి(పట్టభధ్రులు) పోటీ చేస్తున్నారని తెలిపారు. వారి గెలుపుకు ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు శ్రమించాలని కోరారు. ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య ఓటర్ల నమోదు, పీడీఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై మాట్లాడారు. నాయకులు అంగేరి పుల్లయ్య, గంధం మణి పాల్గొన్నారు.










