చిత్తూరు : పెరిగిన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ ... సోమవారం ఉదయం మండుటెండలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద వామపక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ .... ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు, ఇంటిపన్ను, ఇతర పన్నులను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదన్నారు. ధరలు తగ్గించాలని, ప్రజలపై మోపిన భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.










