ప్రజాశక్తి - పెనుమంట్ర
సోమవారం తెల్లవారుజాము నుంచి మండలంలో మోస్తారు వర్షం పడింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమ యమ య్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పొలమూరు నుంచి మాముడూరు వెళ్లే రహదారి గుండా రూ.20 లక్షలతో నిర్మించిన డ్రెయినేజీ ముంపునకు గురై రోడ్డంతా అస్తవ్యస్తంగా తయారైంది. మండలంలో మొత్తం 63.8 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.










