అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్‌లు, ఫ్యామిలీ పెన్షనర్‌లు ఈకెవైసి అనుసంధానం కోసం జిల్లా పెన్షనర్స్ భవన్‌లో సదుపాయం కల్పించినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.పెద్దన్నగౌడ్, శీలా జయరామప్ప తెలిపారు. బుధవారం నాడు ఎన్జీవో హోంలోని పెన్షనర్స్ భవన్‌లో జిల్లా ట్రెజరీ అధికారుల సూచనల మేరకు పెన్షనర్‌లకు ఈకెవైసి అనుసంధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా ట్రెజరీ అధికారుల సూచనల మేరకు 3వ తేదీ నుంచి పెన్షనర్‌లు పెన్షన్ ఐడి సిఎఫ్‌ఎంఎస్ నంబర్‌కు అనుసంధానంగా ఉన్న ఆధార్ నెంబర్‌ను ఈకెవైసి లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతపురం ఎస్టీవో పరిధిలో ఉన్న పెన్షనర్‌లు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈకెవైసి సదుపాయం సిబ్బందిచే కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈకెవైసి కార్యక్రమం ఎస్టీవో అనంతయ్య, పర్యవేక్షణలో సీనియర్ అసిస్టెంట్ మసూద్ వలి, అకౌంటెంట్ చేత ఈకెవైసి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం జిల్లా కోశాధికారి రామక్రిష్ణ, కార్యవర్గ సభ్యులు దేనియల్ ప్రభాకర్, చంద్రశేఖర్ రెడ్డి, వరదరాజులు, మధు, అనంతయ్య, పెన్షనర్స్ భాస్కర్ రెడ్డి, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.










