అనంతపురం కలెక్టరేట్ : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ విశ్రాంత ఉద్యోగులు ''వెల్ఫేర్ గ్రూప్ ఫ్రెండ్స్'' పేరిట, విశ్రాంత ఉద్యోగులు, స్నేహితులు, పూర్వ విద్యార్థుల సహకారంతో స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగా, జవహర్ బాలభవన్ కాంపౌండ్ ముందు నెల రోజులుగా ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.పెద్దన్నగౌడ్, శీలా జయరామప్ప జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి యు.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహణలో పాలు పంచుకోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు రామకష్ణ, ప్రభాకర్, రమేష్, దానియల్ ప్రభాకర్, వరదరాజులు, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్, సూర్యనారాయణ, మధుసూదన్, నిర్వాహకులు శ్రీరాములు, ఎఎస్‌ఎన్.రాజు, రాజశేఖర్, నగేష్, నారాయణ పాల్గొన్నారు.










