May 03,2023 22:43

ప్రజాశక్తి - భీమవరం
            ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులు తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలని ఉప ఖనిజ అధికారి ఎవి.రవివర్మ సూచించారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇకెవైసిపై బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రవివర్మ మాట్లాడుతూ ఈ నెల పదో తేదీ ఇకెవైసి చేయించుకోవాలని తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీన పాలకోడేరు, 9న వీరవాసరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రెజరరీ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఇకెవైసి తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఇకెవైసి నమోదు ప్రక్రియను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కూడా వారి సిఎఫ్‌ఎంఎస్‌ ఐడి లాగిన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇకెవైసి నమోదులో సందేహాలు, సేవల నిమిత్తం కార్యాలయ సిబ్బంది టిఎస్‌.భాస్కరరావు 9912243377, ఉపఖజనా అధికారి 6302618446 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో రిటైర్డ్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్‌, కార్యదర్శి పి.సీతారామరాజు, యుజిసి పెన్షనర్ల సంఘం అధ్యక్షులు సత్యనారాయణరాజు, కార్యదర్శి సుబ్బారావు, రాష్ట్ర ట్రెజరర్‌ అప్పలరాజు పాల్గొన్నారు.