Oct 10,2023 22:06

గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న పెన్షనర్లు

ప్రజాశక్తి - ఆమదాలవలస: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పదో తేదీ వరకు పెన్షన్‌ చెల్లించకపోవడం దారుణమని ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు అన్నారు. పెన్షనర్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ పట్టణంలో గాంధీ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్థనరావు, కోశాధికారి హెచ్‌.వి సత్యనారాయణ, కార్యదర్శి పి.భానోజీరావు, ఉపాధ్యక్షులు ఎన్‌.చంద్రశేఖరరావు, బి.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.