పెనాల్టీలు రద్దు చేయాలి
ప్రజాశక్తి-పుంగనూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై రకరకాల పేర్లతో పెనా ల్టీలు వేయడాన్ని రద్దుచేయాలని జోనల్ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవా రం పుంగనూరులో ఎస్‌డబ్ల్యూఎఫ్ డిపో సర్వసభ్య సమావేశం హరినాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ జీవో నెంబర్లు 70, 71 లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రావడం దారుణం అన్నారు. ఇందులో నాయక క్లాజులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులు తుమ్మినా, దగ్గినా శిక్షకు సిద్ధం కండి అనే విధంగా ఉన్నాయని, ఈ రెండు జీవోలను వెంటనే రద్దు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును, ట్రేడ్ యూనియన్ నిర్వహణ హక్కును, సమస్యలపై చిన్నపాటి ఆందోళన చేసిన వాటిని కూడా దుష్ప్రవర్తన కింద ప్రభుత్వ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యల్లో చేపట్టడం దుర్మార్గమన్నారు. ఆర్టీసీలో ఉన్న కాంటాక్ట్ రెగ్యులేషన్స్ లోని రాజ్యాంగ వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక అంశాలను గతంలో హైకోర్టు కూడా కేసు వేయడం జరిగిందన్నారు. ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతే ఎంఈ చట్టం ప్రకారం ఆయనకు తగిన పెనాల్టీ ఉంటుంది. అయితే దీనికి విరుద్ధంగా కండక్టర్ నిబంధనలు రూపొందించారు. రోడ్డుపై ట్రాఫిక్ కారణంగా బస్సును ఎదుటి వ్యక్తి వాహనం ఢకొీన్న సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్‌పై చట్టాలు తీసుకురావడం సిగ్గు చేటు. ఆర్టీసీ అధికారులకు విశేష అధికారాన్ని కట్టబెట్టి ఉద్యోగులను విధుల నుండి విచక్షణ రహితంగా తొలగించుటకు ఉద్యోగుల హక్కులను వినియోగించేలా ఉన్నది. ఉద్యోగ భద్రతకు మార్గదర్శక సూత్రాలుగా ఉపయోగపడుతున్న వన్ బార్ 2019 సర్క్యులర్‌లోని అంశాలను విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 71 లో అప్పిలేట్ వ్యవస్థ గురించి ప్రస్తావిం చారు. గతంలో 2020లో ముందు ఉన్నటువంటి అప్పిలేట్ దంతరను తగ్గించడం ద్వారా ఉద్యోగులకు తీవ్ర నష్టం అందుచేత దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు సరైన సౌకర్యాలు అందుతాయని ఆశతో ఉన్నవారికి నిరాశ ఎదురయింది అన్నారు. ఇప్పటి కైనా ఆర్టీసీ ఉద్యోగులపై పెనాల్టీలు రద్దు చేయాలని, మహిళా కండక్టర్లకు కిలోమీటర్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక: పుంగనూరు డిపో ఎస్‌డబ్ల్యూఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షుడిగా వాడ గంగరాజు, అధ్యక్షుడిగా హరిప్రసాద్, కార్యదర్శిగా వాణి రెడ్డమ్మ, కోశాధికారిగా శిరీష, పబ్లిసిటీ కార్యదర్శిగా మమతలతో పాటు ఆరు మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.










