Mar 11,2023 20:55

ప్రజాశక్తి - భీమవరంరూరల్‌
పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. తుందూరు గ్రామం చిన్నపేటలో శనివారం గ్యాస్‌ ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. పెంచిన గ్యాస్‌ ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్టి చంద్రమ్మ, మరియమ్మ, పాలపర్తి సుచిత్ర, నాగరత్నం పాల్గొన్నారు.