Jul 02,2022 22:43

పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలి
వామపక్షాల వినూత్న నిరసన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షపార్టీల పిలుపుమేరకు శనివారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో అర్ధనగంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, సిపిఎం నగర కార్యదర్శి సురేంద్రన్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజలపై ఎలాంటి పన్నులు పెంచను అని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వివిధ రకాల పన్నులను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్రభార్యని మోపడాన్ని త్రీవంగా విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో అభివద్ధికి నోచుకోకపోవడం దురదష్టకరమన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సామాన్య, పేదల ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి కూడా వీలులేకుండా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. వెంటనే పెంచిన బసు చార్జీలు తగ్గించాలని లేనిపక్షంలో ప్రజలే వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, నగర కార్యదర్శి విసి.గోపినాథ్‌, సిపిఎం జిల్లా నాయకులు కె.సురేంద్రనాథ్‌, ప్రసాద్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కె.మణి, ఎన్‌.సురేంద్రనాథ్‌, ఏ.సత్యమూర్తి, దాసరి చంద్ర, జిల్లా నాయకులు టి.కోదండయ్య, ఎం.విజరు కుమార్‌, విజయకుమార్‌, జయ కుమారి, విజయ, గౌరీ, కుమారి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.