Apr 08,2023 22:10

ప్రజాశక్తి - మొగల్తూరు
             మండలంలోని పేరుపాలెం బీచ్‌ క్రైస్తవులతో శనివారం కళకళలాడింది. ఏసుప్రభు శ్రమకాల దీక్ష విరమణ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దీక్షదారులు కుటుంబ సభ్యులతో శుక్రవారం రాత్రి తరలివచ్చారు. వేలంకిని మాత ఆలయంలో దీక్ష విరమణ చేశారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సముద్ర స్నానాలు ఆచరించారు. బీచ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్‌పి రవి మనోహరచారి పర్యవేక్షణలో సిఐలు శ్రీనివాస్‌ యాదవ్‌, సురేష్‌ బాబు, ఎస్‌ఐ ఎం.వీరబాబు, సుధాకర్‌ రెడ్డి, విశ్వనాథ్‌లతో సుమారు 200 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.