ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : పేదరికాన్ని రూపమాపడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యం, అందుకే సిఎం జగన్మోహన్‌రెడ్డి మళ్లీ సిఎం కావాల్సిన అవసరముందని వైసిపి నాయకులు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నరుకూరులోని రిషి కళ్యాణ మండపంలో ఎపికి మళ్లీ జగనే సీఎం ఎందుకు కావాలి.. అనే కార్యక్రమం జరిగింది. వైసిపి మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తలమంచి సు రేంద్ర బాబు, ఎంపిపి ఉప్పల స్వర్ణలత, ఎఎంసి డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, చెరుకూరు శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల విప్లవం రాష్ట్రంలో జరుగుతుందన్నారు. సిఎం జగన్ అంటేనే ఒక సంక ల్పం అని కొనియాడారు. వైసీపీ నాయకు లు, ప్రజాప్రతినిధులు, సచివాలయం కన్వీనర్లు, గహ సారదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










