Oct 30,2023 23:06

నరసన్నపేట : పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణదాస్‌

ప్రజాశక్తి- నరసన్నపేట: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మండలంలోని బొరిగివలస సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబమూ దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని బాగున్నప్పుడే ఆ రాష్ట్రాభివృద్ధి పథంలో ఉంటుందని, మన రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధించిందని వివరించారు. ముందుగా కృష్ణదాస్‌ ఆరోగ్య సురక్ష శిబిరంలో బిపి, సుగర్‌, పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
కవిటి: ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని జగతిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో పాల్గొన్నారు. అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్‌ పరిశీలించి పోషణ కిట్లు అందించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కడియా ప్రకాష్‌, సర్పంచ్‌ పూడి ప్రసాదరావు, వైస్‌ ఎంపిపి పూడి నేతాజీ, ఎంపిటిసి డి.సతీష్‌, ఎన్ని అశోక్‌, తహశీల్దార్‌ పి.శేఖర్‌, ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, డిటి రామచంద్రరావు, ఐసిడిఎస్‌ సిడిపిఒ నాగరాణి, ఎపిఎం గోవిందరావు, అంగన్వాడీ సూపర్‌ వైజర్లు కృష్ణవేణి, పల్లవి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని రెయ్యిపాడులో నిర్వహించిన ఆరోగ్య సురక్షలో జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రతినిధి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. డాక్టర్‌ సుధీర్‌ ఆధ్వర్యాన వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మద్దిలి హరినారాయణ, సర్పంచ్‌లు బచ్చల ధర్మారావు, బత్తిన ప్రసాదరావు, తహశీల్దార్‌ బి.అప్పలస్వామి, ఇఒపిఆర్‌డి డి.తిరుమలరావు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ గంగమ్మ పాల్గొన్నారు.
నందిగాం: మండలంలోని శివరాంపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షను కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎంపపి ఎన్‌.శ్రీరామ్మూర్తి ప్రారంభించారు. అనతరం వైద్య శిబిరం, స్టాల్స్‌, డ్వాక్రా వస్తు ప్రదర్శనను పరిశీలించారు. వృద్ధులకు కళ్లద్దాలు, రోగులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు బాలక మధుసూదనరావు, ఎంపిటిసి పిన్నింటి జయరాం, అంబోడి విష్ణు, ఎంపిడిఒ శివప్రసాద్‌, డిటి ధనలక్ష్మి, సర్పంచ్‌లు సబ్బి జానకిరామ్‌, శంభాన దానయ్య బొమ్మాలి గున్నయ్య పాల్గొన్నారు.
కోటబొమ్మాళి : మండలంలోని మాసాహెబ్‌పేటలో సర్పంచ్‌ సంపతిరావు ధనలక్ష్మి ఆధ్వర్యాన నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణిలు పాల్గొన్నారు. వైద్యులు 302 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే కమలనాభపురంలో నిర్వహించిన ఆరోగ్య సురక్షలో భాగంగా అంగన్వాడీలు ఏర్పాటు పౌష్టికాహార స్టాల్స్‌ ప్రదర్శనలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, ఎంపిడిఒ కె. ఫణీంద్రకుమార్‌, డిటి ఆర్‌.మధు, మండల విద్యాశాఖాధికారి ఎల్‌.వి.ప్రతాప్‌, గడ్డవలస నాగభూషణరావు పాల్గొన్నారు.
పొందూరు: మండలం కొంచాడ గ్రామంలో తాడివలస పిహెచ్‌సి ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన 324 మందికి వైద్య పరీక్షలను జరిపి మందులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెయ్యిల అనూరాధ, ఎంపిటిసి పెయ్యిల సరస్వతి, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్‌, వైసిపి మండల జెసిఎస్‌ బాడాన వెంకట కృష్ణారావు, వైసిపి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బండారు జైప్రతాప్‌కుమార్‌, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, వైద్యాధికారులు బి.రమేష్‌ నాయుడు, మల్లీశ్వరమ్మ, రాజేశ్వరరావు, ఎస్‌.జ్యోత్స్న, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.