
ప్రజాశక్తి- పలాస: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా వైద్య సేవలందించి మందులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో సచివాలయాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఈ శిబిరాలకు విశేష స్పందన లభించిందన్నారు. అనంతరం వైద్యులు రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ బొర బుజ్జి, పట్టణ అధ్యక్షులు సనపల సింహాచలం, కౌన్సిలర్ బల్ల శ్రీను, కో-ఆప్షన్ సభ్యులు కోణంకి శ్రీనివాసరావు, పోతనపల్లి హరి, మార్పు యుగంధర్, తాడి పాల్గొన్నారు.
అమలకుడియాలో...
మండలంలో అమలకుడియాలో జగనన్న ఆరోగ్య సురక్షలో పిఎసిఎస్ అధ్యక్షులు పైల వెంకటరావు (చిట్టి), ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, సర్పంచ్ కొర్ల శిరీష, కొర్ల మురళీకృష్ణ చౌదరి, దువ్వాడ రవికుమార్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు కొర్ల సంతోష్ కుమార్, ఎంపిడిఒ ఎన్.రమేష్‌నాయుడు, తహశీల్దార్ మధుసూదనరావు, మండల విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు, ఐసిడిఎస్ పిఒ డి.శార్వాణి పాల్గొన్నారు.
మెళియాపుట్టి : మండలంలోని బాణాపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షను ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరిశీలించారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంఇఒ ఎం.పద్మనాభం, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్ అధ్యక్షులు ఉర్లన బాలరాజు, వైసిపి మండల కన్వీనర్ పల్లి యోగి, సర్పంచ్ పెద్దింటి చందర్రావు, వైద్యాధికారులు హేమంత లక్ష్మి, పావని పాల్గొన్నారు.
కొత్తూరు : స్థానిక ప్రాథమిక పాఠశాల-1 ఆవరణలో నిర్వహించిన ఆరోగ్య సురక్షను ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరిశీలించారు. ఐసిడిఎస్ ఆద్వర్యాన నిర్వహించిన పౌష్టికాహార స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.కృష్ణవేణి, తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపిడిఒ ఎం.పావని, ఐసిడిఎస్ పిఒ విమలకుమారి, సూపర్‌వైజర్ ఎల్.శాంతికుమారి, జెడ్‌పిటిసి కె.భాగ్యవతి, పిఎసిఎస్ అధ్యక్షుతు చింతాడ సూర్యనారాయణ పాల్గొన్నారు.
కవిటి: ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్ సూచించారు. మండలంలోని డి.జి.పుట్టుగలో నిర్వహించిన ఆరోగ్య సురక్షను ప్రారంభించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి పోషణ కిట్లు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ బెందాళం కిరణకుమారి, నాయకులు బెందాళం జయప్రకాష్ నారాయణ, యలమంచి నీలయ్య, చందాన పూర్ణ చంద్రుడు, తహశీల్దార్ పి.శేఖర్, ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: మండలంలోని పెద్దమురహరిపురంలో నిర్వహించిన ఆరోగ్య సురక్షను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ వైద్య శిబిరంలో 462 మందికి వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి 12 మందిని పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. కార్యక్రమంలో వైసిపి క్లస్టర్ ఇన్‌ఛార్జి గోరకల విశ్వనాథం, మద్దిల హరినారాయణ, మాజీ సర్పంచ్ పుచ్చ నాయకన్న, మాజీ ఎంపిటిసి సైనీ ధర్మారావు, తహశీల్దార్ బి.అప్పలస్వామి, ఇఒపిఆర్‌డి తిరుమలరావు, వైద్యులు సుధీర్, ప్రత్యూష పాల్గొన్నారు.
టెక్కలి : మండలంలోని పాతనౌపడలో సచివాలయం పరిధిలో పెద్దరోకళ్లపల్లి, పాతనౌడపలో నిర్వహించిన ఆరోగ్య సురక్షను నియోజకవర్గ ఇన్‌ఛార్జి, జెడ్‌పిటిసి దువ్వాడ వాణి పరిశీలించారు. ఇందులో భాగంగా పభుత్వ పనితీరుని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దల్లి లోకేశ్వరరెడ్డి, రాంపాతృని అనూష, దువ్వాడ హైందవి, ఎంపిటిసి సుగ్గు ఆప్పలరెడ్డి, ఎంపిపి ప్రతినిధి ఆట్ల రాహుల్ పాల్గొన్నారు.
అలాగే మండలంలోని బొప్పాయిపురం పంచాయతీలో సర్పంచ్ గుజ్జి మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. చల్లపేట, బొప్పాయిపురం గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. శిబిరంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల వివరాలను వివరించారు.
నందిగాం : మండలంలోని కవిటిగ్రహారంలో సర్పంచ్ ప్రతినిధి బొమ్మాళి గున్నయ్య నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పెరాడ తిలక్, ఎంపిపి ఎన్.శ్రీరామ్మూర్తి, తహశీల్దార్ వై.వి.పద్మావతి, ఇఒఆర్‌డి రాజారావు, వైద్యాధికారులు, పి.అంజలి, కె.అనిత, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్ పాల్గొన్నారు. ముందుగా వైద్య శిబిరం, ఏర్పాటు చేసిన స్టాల్స్, డ్వాక్రా వస్తు ప్రదర్శనను తిలకించారు. వృద్ధులకు, విద్యార్థులకు కళ్లద్దాలు, రోగులకు మందులు పంపిణీ చేశారు.
ఇచ్ఛాపురం : మండలంలోని అరకబద్రలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షను జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ పాల్గొన్నారు. శిబిరాన్ని పరిశీలించి రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.మోహనరావు, కారింగా మోహనరావు, నూకయ్యరెడ్డి, కె.త్రినాథ్, ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.
లావేరు: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి సంతప్తి చెందారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఆర్.బాలకృష్ణ, జెడ్‌పిటిసి ఎం.సీతం నాయుడు, ఎంపిడిఒ సురేష్ కుమార్, జెసిఎస్ ఇంఛార్జి మీసాల శ్రీనువాసురావు, వైద్యాధికారులు, సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ, అధికారులు పాల్గొన్నారు.
పొందూరు: మండలంలోని లోలుగులో తాడివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించారు. వైద్యులు సాగరిక, శివశంకర్, శైలజ, అనిల్‌కుమార్‌లు 436 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ లోలుగు ధనలక్ష్మి, ఎంపిటిసి లోలుగు లక్ష్మున్నాయుడు, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్‌కుమార్ పాల్గొన్నారు.