దుస్తులు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు : పేదవారి ఆకలి తీర్చే ఉద్ధేశ్యంతో శీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శనివారం పేదలకు దుస్తులు, ఆహారం అందజేశారు. పలువువురు తమ పెద్దల జ్ఞాపకార్థం కందుకూరు పట్టణ వీధుల్లో తిరుగుతూ ఉండే యాచుకులకు, నిరాశ్రుయులకు భోజనం ప్యాకెట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు ఉదయం , మధ్యాహ్నం,రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు, సభ్యులు ఇన్నమూరి శ్రీనివాసులు, చీదెళ్ళ క్రష్ణ, చీదెళ్ళ అశ్వినిప్రియ ,గోనుగుంట వేణుగోపాల రావు, నల్లమల్లి శ్రీనివాసులు ఉన్నారు.










