May 04,2023 21:54

మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

         నార్పల : పేదలకు చేయూతనిచ్చి సిఎం జగనన్నకు చేయూతనిద్దామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గురువారం మండల పరిధిలోని చామలూరు, నిలువురాయి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాల ద్వారా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ సిఎం జగన్‌ ప్రజలకు అండగా నిలిచారన్నారు. అంతేగాకుండా నవరత్నాలకు అనుబంధంగా ఎన్నో కొత్తవాటిని చేర్చుకుంటూ వెళ్తున్నామన్నారు. అయితే దుష్టచతుష్టయం మాత్రం కక్షగట్టి జగన్‌పై అనేక విమర్శలు చేస్తున్నారన్నారు. వారి మాయమాటలను నమ్మవద్దన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ము నేరుగా ప్రజల ఖాతాల్లో పడినప్పుడల్లా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. మీ ఆశీర్వాద బలం ఉంటే జగన్‌ను మరోసారి సిఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ నార్పల సత్యనారాయణరెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ వేదాంతం నాగరత్నమ్మ, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు మల్లేశ్వరయ్య, సర్పంచి ఆకులేటి స్వప్న, సచివాలయం సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.