Oct 16,2023 18:13

పేదలకు భోజనం వడ్డిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో పేదల ఆకలి తీర్చే దిశగా శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ సేవలందిస్తోంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా సోమవారం కీర్తిశేషులు నల్లూరి బాలచంద్రుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా నల్లూరి శారద వారి కుటుంబ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణ వీధుల్లో తిరుగుతూ ఉండే యాచుకులకు నిరాశ్రుయులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు సేవాహ్రదయ శ్రీ రవ్వా శ్రీనివాసులు సభ్యులు చీదెళ్ళ క్రష్ణ, ఇన్నమూరి శ్రీనివాసులు, గోనుగుంట వేణుగోపాలరావు, చిన్ని వెంకటేశ్వర్లు ఉన్నారు.