Oct 11,2023 19:43

భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్దాం.. వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూద్దాం.. అనే నినాదంతో పేదవారి ఆకలి తీర్చే దిశగా పయనిస్తూ శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా బుధవారం చీదెళ్ల ప్రసాదు, లక్ష్మి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారి పిల్లలు మణిమాల, తారక్‌ల సహకారంతో కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకషి మానసిక విక లాంగుల ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు మాట్లాడుతూ పెళ్లిరోజు వేడుకలు ఇంటికే పరిమితం కాకుండా ఇలాంటి మానసిక వికలాంగుల పిల్లలకు భోజనం ఎర్పాటు చేయడం మచిదన్నారు.